Namaste NRI

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్న ఫిస్‌ఇన్‌ కంపెనీ 

ప్రపంచంలోని అతిపెద్ద చేపల ఎగుమతి సంస్థ ఫిష్‌ఇన్‌ తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో సమీకృత స్వచ్ఛనీటి చేపలు, రొయ్యల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. సిరిసిల్ల జిల్లాలోని మద్యమానేరు రిజర్వాయర్‌ వద్ద ప్రపంచస్థాయి ప్రమాణాలతో దీనిని నిర్మిస్తామని, అయిదువేల మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ వెల్లడిరచింది. అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో సంస్థ చైర్మన్‌, సీఈవో మనీశ్‌కుమార్‌ తమ నిర్ణయాన్ని వెల్లడిరచారు. రూ.వెయ్యి కోట్లతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్‌ ఫ్రెష్‌  వాటర్‌ ఫిష్‌ కల్చర్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నామని వెల్లడిరచారు. దీంతో ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

               రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌ మానేరు రిజర్వాయర్‌ వద్ద ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కంపెనీ కార్యకలాపాలను ప్రారంభిస్తామని మనీష్‌ కుమార్‌ తెలిపారు. చేపల ఉత్పత్తిలో హ్యాచరీలు, దాణా తయారీ, కేజ్‌ కల్చర్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌ మరియు ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు. కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ప్రతి ఏడాది రాష్ట్రం నుంచి సుమారు 85 వేల మెట్రిక్‌ టన్నుల చేపలను ఎగుమతి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టన్ను ఫిష్‌ ఇన్‌ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డైరెక్టర్‌ అఖిల్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events