దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పాలని టీఆర్‌ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతున్న గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నది, పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గత ఏడు సంవత్సరాల బీజేపీ పాలనలో సామాన్య ప్రజల బతుకు ఆగమైందన్నారు. ఇష్టానుసారంగా ధరలు పెంచి సామాన్యులు బతకలేని స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. పెంచిన ధరలు తగ్గించే వరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)