కెనడా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కెనడా ప్రజలు ఎవరైతే ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారి బాగోగులు చూసే వారు, వారికి మద్దతిచ్చే వారికి పన్ను మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నామని, ఇలా కెనెడియన్లకు ఆర్థికంగా సహాయపడాలని భావిస్తున్నామని కెనడా మంత్రి సీన్ ఫ్రైజర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనెడియన్లు చేస్తున్న సహాయాన్ని చూస్తున్నామని అన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు మరింత సహాయం చేయడానికి లాభాపేక్ష లేని ఎన్జీవోలతో కలిసి ముందుకు సాగాలని అనుకుంటున్నామని, దీని ద్వారా మరింత మందికి మద్దతిచ్చిన వారమవుతామని తెలిపారు.
ఇంతటి విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఉక్రెయిన్ ప్రజలకు తాత్కాలిక నివాసాలతో పాటు, విద్యావకాశాలు కూడా కల్పించాలని భావించామని, ఇందుకోసం దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నామని వెల్లడిరచారు. ఓ జాబ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తున్నామని అందుబాటులో ఉన్న ఉద్యోగాలను ఇవ్వడానికి కూడా తమ సర్కార్ సిద్ధమవుతోందని ప్రకటించారు. కెనడాకు వచ్చే ఉక్రెయిన్ ప్రజలు రెండేళ్లు కెనడాలో ఉండొచ్చని గతంలో ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు దీనిని మూడేళ్లకు పెంచుతున్నామని మంత్రి ప్రకటించారు.