కృష్ణా జలాల విషయంతో పాటు తెలంగాణకు సంబంధించిన ఏ అంశంలోనూ రాజీపడమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలు, సమస్యలపై పోరాటం చేసేది ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా, అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని అన్నారు. అన్ని వర్గాలను అభివృద్ది పథంలో నడపడమే తమ ధ్యేయమని, కరోనాను కూడా లెక్క చేయకుండా అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు.