నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి. ఈ చిత్రంలో షెర్లీ సెటియా నాయికగా నటిస్తున్నది. ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఉషా ముల్పూరి నిర్మాత. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ ఆర్.కృష్ణ మాట్లాడుతూ కూల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది. టీజర్లో కృష్ణ వ్రిందల రొమాన్స్ చూసుంటారు. మూవీలో దీనికి మించి ఉంటుందని అన్నారు. ఈ చిత్రం ఛలో కంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. గ్యారెంటిగా చాలా పెద్ద హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా చేశాము అని తెలిపారు. మా అమ్మ ఈ సినిమాకు నిర్మాత. ఖర్చు గురించి ఆలోచించకుండా క్యాలిటీగా సినిమా నిర్మించింది. ఆడవారితో సత్సంబంధాలు ఉండాలని కోరుకునే యువకుడిగా కనిపిస్తాను. షెర్లీ నాయికగా మంచి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సినిమాలో రొమాన్స్‌తో పాటు మంచి కామెడీ ఉంటుందన్నారు. టీజర్లో కృష్ణ, వ్రింద ప్రేమ మిమ్మల్ని ఆకట్టుకుందని ఆశిస్తున్నాం అని అన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 22న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.