అంతర్జాతీయ కొరియర్ డెలివరీ సంస్థ ఫెడెక్స్‌కు భారతీయ సంతతికి చెందిన రాజ్ సుబ్రమణియమ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చైర్మన్, సీఈవో ఫ్రెడ్రిక్ వి స్మిత్ స్థానంలో రాజ్ సుబ్రమణియమ్ ఆ బాధ్యతలు తీసుకుంటారు. ఫ్రెడ్రిక్ ఓ విజినరీ నేత అని, వ్యాపార ప్రపంచంలో అతనో లెజెండ్ అని, ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీని ఆయన స్థాపించారని, ఆయన బాధ్యతలను స్వీకరించడం గౌరవంగా భావిస్తానని సుబ్రమణియమ్ తెలిపారు. రాజ్ సుబ్రమణియన్ మూడు దశాబ్దాల క్రితం ఫెడెక్స్‌లో జాయిన్ అయ్యారు. సుబ్రమణియన్ వయస్సు 56. 1991లో చేరిన ఆయన ఆసియా, అమెరికా పలు మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ బాధ్యతలను నిర్వర్తించారు. అతను త్వరలోనే చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. అక్కడ కార్పొరేట్ స్ట్రాటెజీ డెవలప్‌మెంట్ బాధ్యతలు చేపట్టారు.
ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ సీఈవో, ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఫెడెక్స్ ప్రపంచ అతిపెద్ద ట్రాన్స్‌ఫోర్టేషన్ కంపెనీ. 2020లో ఫెడెక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో చేరారు. సుబ్రమణయమ్‌కు ముప్పై సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2020లో ఫెడెక్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌కు సుబ్రమణియం ఎంపికయ్యారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఫ్రెడ్రిక్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇక బోర్డు పరిపాలనపై దృష్టి పెట్టనున్నట్లు స్మిత్ తెలిపారు. టెన్నిసెసీలో ఫెడెక్స్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ కంపెనీలో సుమారు ఆరు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.