Namaste NRI

రాష్ట్రపతి భవన్‌లో.. పద్మ పురస్కారాల ప్రదానం

వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 65 మంది ప్రముఖులకు 2022 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌ దర్బార్‌ హాల్‌లో ఘనంగా రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌కు మరణాంతరం ప్రకటించగా.. ఆయన తనయుడు, ఎంపీ రాజీవ్‌ సింగ్‌ స్వీకరించారు. శాస్త్రీయ సంగీత గాయని ప్రభు ఆత్రే కూడా పద్మవిభూషణ్‌ అందుకున్నారు. కరోనా వైరస్‌కు దేశీయ టీకా కొవాగ్జిన్‌ను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులిద్దరికీ సంయుక్తంగా పద్మభూషణ్‌పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. బెంగాలీ నటుడు విక్టర్‌ బెనర్జీ కూడా పద్మభూషణ్‌ అందుకున్నారు. ఒలింపిక్స్‌లో దేశానికి తొలి వ్యక్తిగత బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా పద్మశ్రీ అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న తెలుగుఆరిలో ప్రముఖ సినీ నటి షావుకారు జానకి, కూచిపూడి నృత్యకారిణి పద్మజారెడ్డి, కోయ గిరిజనగాయకుడు రామచంద్రయ్య ఉన్నారు.

                ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల, గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ కార్యక్రమానికి రాలేదు. ఈ నెల 21న జరిగిన మొదటి  విడతలో 54 మంది అవార్డులు అందజేశారు. ఈ ఏడాది నలుగురికి పద్మవిభూషణ్‌, 17 మంది పద్మభూషణ్‌, 107 మంది పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events