ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తనకు విలువైన మిత్రులు అని టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా దేశాలకు చెందిన ప్రతినిధులు శాంతి చర్చల కోసం ఇస్తాంబుల్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎర్డగాన్ మాట్లాడుతూ చర్చల్లో ప్రగతి సాధిస్తే, ఆ ఇద్దరు నేతలు కలుసుకుంటారని, ఆ భేటీని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండు వైపులా న్యాయపరమైన ఆందోళనలు ఉన్నాయనీ, కానీ చర్చల ద్వారా నిర్దిష్టమైన ఫలితాలను అందుకోవాలని ఆయన సూచించారు. రెండు దేశాల మధ్య శాంతి కుదరడం వల్ల ఎవరికీ నష్టం ఉండదన్నారు. శాంతి ఏర్పడితే ఓడిపోయేది ఎవరూ లేరని, యుద్ధం కొనసాగితే ఎవరికీ లాభం ఉండదన్నారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)