ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు. సొహైల్, అనన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వరుణ్ సందేశ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కొబ్బరి బోండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి హిట్ చిత్రాలను నాతో తీసిన కృష్ణారెడ్డితో మళ్లీ చాలా కాలం తర్వాత సినిమా చేస్తుండటం హ్యాపీ అన్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మీ తరహా కామెడీ సినిమాలు రావడం లేదని చాలా మంది అడుగుతుండేవారు. నాకూ అదే ఫీలింగ్ ఉండేది. కథలు రాసుకుంటూ సరైన నిర్మాత కోసం వేచి చూశాను. ఈ క్రమంలో కొంత గ్యాప్ వచ్చింది. సోహైల్, అనన్య మంచి జోడీ కుదిరారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణ మరోసారి ఇస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఖుష్బూ, ఆలీ, సునీల్, రష్మీ, హేమ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అమ్ము క్రియేషన్స్ సమర్పణలో కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సి.రామ్‌ప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సాహిత్యం: చంద్రబోస్. స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.














