క్రికెట్ సంచలనం బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయ సారా ఇప్పటికే సెలబ్రిటీ. సారాకు సినిమాలు అంటే ఆమితాసక్తి. గతేడాది డిసెంబర్లో మోడలింగ్‌లో అరంగ్రేటం చేశాక.. దాంతో త్వరలోనే హిందీ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించనుందని తెలిసింది. లండన్ యూనివర్సిటీలో టీలో మెడిసిన్ పూర్తిచేసిన సారా సినిమాల్లో రావడానికి ఆమె నటనలో కొంతకాలం శిక్షణ తీసుకున్నారు. ఇప్పటికే పలు బ్లాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. సినీరంగ ప్రవేశానికి ఆమె తల్లిదండ్రులు సచిన్, అంజలి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇలాంటి ప్రచారం జరిగినపుడు సచిన్ ఖండిరచారు. ఈసారి తగిన ప్లానింగ్‌తో సారా ఎంట్రీ ఇవ్వనుందని తెలిసింది.
………………….