భారత్‌పై తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై కేంద్ర సమాచార` ప్రసార మంత్రిత్వ శాఖ వేటు వేసింది. 16 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది. వీటిలో పది భారతీయ, పాకిస్థాన్‌కు చెందిన 6, వార్తా ఛానళ్లు కూడా ఉన్నాయి. జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, శాంతి భద్రతలకు సంబంధించిన ఇవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఈ ఛానళ్లన్నింటికీ కలిపి 68 కోట్ల మంది వీక్షకులు ఉన్నారని తెలిపింది. 2021 ఐటీ నిబంధనల్లో 18వ నిబంధన కింద సమర్పించాల్సిన వివరాలను ఇవేవీ అందించలేదని తెలిపింది. ఒక వర్గానికి చెందినవారిని ఉగ్రవాదులుగా చూపడం, వివిధ మతాల మధ్య ద్వేషన్ని రెచ్చగొట్టడం వంటివి చేస్తున్నాయని వివరించింది. కాగా ఈ నెల ప్రారంభంలోనూ కేంద్ర సర్కారు ఇదే కారణంలో 22 యూట్యూబ్ చానళ్లను బ్లాక్ చేసింది. ఇందులో నాలుగు పాకిస్థాన్‌కు చెందిన చానళ్లు కాగా, మిగతా 18 భారత్‌కు చెందినవి.