వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పరస్పర వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోలని భారత్, ఐరోపా యూనియన్ (ఈయూ) తాజాగా తీర్మానించుకున్నాయి. భారత్‌లో పర్యటిస్తున్న ఉర్సులా మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకుగాను ఈయూ`భారత్ వాణిజ్య, సాంకేతిక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్‌ల మధ్యలో ఢల్లీిలో జరిగిన భేటీలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. ఈయూ ఏర్పాటు చేయనున్న రెండో వాణిజ్య, సాంకేతిక మండలి ఇది. గతంలో అమెరికాతో ఈ తరహా ఒప్పందాన్ని అది కుదుర్చుకుంది. భారత్‌కు మాత్రం ఇదే మొదటిది. ఉక్రెయిన్ సంక్షోభం సహా పలుకీలక అంశాలపై తాజా సమావేశంంలో మోదీ, ఊర్సులా చర్చించారు. తర్వాత రైసినా డైలాగ్ కార్యక్రమంలో ఉర్సు లా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వ్యూహాత్మకంగా వైఫల్యంగా మారుతుందన్నారు.
……………………….