టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. హరిహర వీర మల్లు కోసం పవన్ కల్యాణ్ యుద్ధవీరుడి అవతారమెత్తారు. యుద్ధం అంటే ఎన్నో సాహసాలు, మరెన్నో మరెన్నో విన్యాసాలకి వేదిక. వాటన్నిటినీ ఆసక్తికరంగా కళ్లకు కట్టే ప్రయత్నంలోనే ఇక్కడ తలమునకలై ఉంది ఈ చిత్ర బృందం. ఇటీవలే ఈ చిత్రంలోని పోరాట ఘట్టాల కోసం ప్రత్యేకంగా సన్నద్ధమైన రంగంలోకి దిగారు పవన్ కల్యాణ్. తను చేసిన విన్యాసాలు కెమెరాలో ఎలా నిక్షిప్తమయ్యాయో ఛాయాగ్రాహకుడు జ్ఞానశేఖర్‌తో కలిసి నిశితంగా పరిశీలిస్తున్నారు. నటనని ప్రదర్శించడమే కాదు, అప్పుడప్పడూ ఇలాంటి పరిశీలన కూడా అవసరమే మరి. ఈ చిత్రంలో ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ మొగలుల కాలం నాటి వజ్రాల దొంగ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. మొత్తానికి పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లులో తనలోని డిఫరెంట్ యాంగిల్‌ను చూపించబోతుండటం ఖాయమని అనుకుంటున్నారు అభిమానులు.