కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం సమ్మతమే. రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో ఎమ్మెల్యే రవీందర్ కుమార్ రావత్ ఈ చిత్రం టీజర్‌ను విడదుల చేశారు. పెళ్లికి ముందు ప్రేమంటే గిట్టని కథానాయకుడు చివరకు ప్రేమలో పడటం ఈ క్రమంలో పండే వినోదంతో టీజర్ ఆకట్టుకుంది. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ కెరీర్ తొలినాళ్లలో దర్శకుడు, నేను కలిసి షార్ట్‌ఫిల్మ్స్ తీశాం. ఈ సినిమా కోసం మరింత బాధ్యతతో కిరణ్ అబ్బవరం పనిచేశాం. శేఖర్‌చంద్ర చక్కటి బాణీలిచ్చారు. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా ఆలరిస్తుంది అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా పాటలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఆహ్లాదభరిత ప్రేమకథతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రేక్షకులందరూ తమ సమ్మతిని తెలియజేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. యాజీ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ కంకణాల నిర్మించారు. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానినికి కెమెరా: సతీష్ రెడ్డి మాసం, సంగీతం: శేఖర్ చంద్ర, ఆర్ట్: సుధీర్ మాచర్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి.