Namaste NRI

మెగాస్టార్‌ తో రీ ఎంట్రీ ఇస్తున్న రాధిక

వరుస  సినిమాలతో జోరు చూపిస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన ఇటీవలే ఆచార్య గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. మెగాస్టార్‌తో మెగా ప్రాజెక్టు చేయనున్నట్టు సీనియర్‌ నటి రాధిక ప్రకటించారు. రాధిక తన సొంత బ్యానర్‌లో రాడాన్‌ను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్యానర్‌పై ఆమె సీరియల్స్‌, మరోవైపు సినిమా నిర్మిస్తు ఉన్నారు. చిరంజీవితో ఆమెకు మంచి స్నేహం ఉందనే విషయం తెలిసిందే. చిరంజీవి సినిమా న్యాయం కావాలితోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇపుడామె చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్టు ప్రకటించారు. కింగ్‌ ఆఫ్‌ మాస్‌తో బ్లాక్‌ బాస్టర్‌ ప్రాజెక్టు చేసేందుకు చాలా ఎక్టయిటింగ్‌గా ఎదురు చూస్తున్నానని తెలిపింది.  రాధికా శరత్‌ కుమారి మరి  చిరంజీవితో చేయబోతుంది ఎలాంటి ప్రాజెక్టు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌ నెలకొంది. సినిమానా, వెబ్‌ సిరీస్‌ అనేది మేకర్స్‌ నుంచి క్లారిటీ వస్తే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events