జులై నెలలో వాషింగ్టన్ లో నిర్వహించే అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. మాసాబ్ టాంక్‌లోని తన కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ను ఆసోసియేషన్ ప్రతినిధులు సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సంవత్సరం జులై 1, 2, 3 తేదీలలో ఆటా వేడుకలను నిర్వహించే వేడుకలకు తప్పక హాజరు కావాలని మంత్రిని ఆటా ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంతో అమెరికాలోని తెలుగు వారిని అందరిని ఒకేచోట కలుసుకుంటారని, ఆ సందర్భంం ఓ మధురానుభూతి అన్నారు. మన, సంస్కృతిని తెలియజేసే విధంగా సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల నుండి వేడుకలు నిర్వహించలేకపోయారని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)