Namaste NRI

అశోకవనంలో అర్జున కల్యాణం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

విశ్వక్‌ సేన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్‌ పతాకంపై బాపినీడు, సుధీర్‌ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి కిరణ్‌ రచనలో విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించారు. ఈ మే 6న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులను అలరించడమే నా ధ్యేయం. వారు బాధ పడే పని ఎప్పటికీ చేయను. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌తో పాటు బలమైన కథ, సంగీతం, పాటలు సమపాళ్లలో ఉంటాయి. వయస్సు మీద పడుతున్నా పెళ్లి కాని యువకుడైన అల్లం అర్జున్‌కుమార్‌ పడే బాధలే ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది అన్నారు. ఈ వేడుకల్లో విద్యాసాగర్‌ చింత, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, రుక్సార్‌ థిల్లాన్‌, చిత్ర కథారచయిత, షో రన్నర్‌ రవికిరణ్‌ కోలా, సంగీత దర్శకుడు జై క్రిష్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events