ఇస్లాం పట్ల వ్యతిరేకత, ముస్లింల పట్ల విద్వేషం, వారిపై దాడులు ఇతర దేశాల్లోనే కాదు, అమెరికాలోనూ సంభవిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రంజాన్ సందర్భంగా శ్వేతసౌధం నుంచి బైడెన్ మాట్లాడారు. ప్రపంచమంతటా ముస్లింలు హింసా దౌర్జన్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత విశ్వాసాల పేరుతో ఎవరి పట్ల కూడా దుర్విచక్షణ చూపడం సరికాదని, మతం పేరుతో ఎవరూ ఎవరినీ అణగదొక్కకూడదని అన్నారు. ఇన్ని సవాళ్ల మధ్య కూడా వారు అమెరికాను అనుదినం బలోపేతం చేస్తున్నారని కొనియాడారు. యెమెన్లో కాల్పుల విరమణ పుణ్యమా అని ఆరేళ్ల తరవాత మొదటిసారిగా ఈద్ పండుగ జరుపుకోగలిగారన్నారు. మతం, జాతి, ప్రాదేశిక ప్రాతిపదికలపై కాకుండా ఒక మహత్తర భావన ఆధారంగా ఏర్పడిన ఏకైక దేశం అమెరికాయేనని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)