ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజా చిత్రం మా ఇష్టం (డేంజరస్). నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎప్పుడూ ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారు. కొత్త జోనర్ చిత్రాన్ని పరిచయం చేస్తుంటారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో ఆయన మా ఇష్టం చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్క్ ఏనీథింగ్ పేరుతో హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రామ్‌గోపాల్ వర్మతో పాటు చిత్ర నాయికలు పాల్గొన్నారు. విద్యార్థులతో జరిపిన ముఖాముఖిలో వారు అడిగిన పలు ప్రశ్నలకు రామ్‌గోపాల్‌వర్మ సమాధానాలిచ్చారు. ఇది ఇద్దరు మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమకథ అని చెప్పారు. ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.