Namaste NRI

లక్కీ స్టార్‌ వస్తున్నాడు

కన్నడ హీరో యశ్‌ నటించిన  చిత్రం లక్కీ. ఈ చిత్రంలో రమ్య హీరోయిన్‌. డా. సూరి దర్శకత్వం వహించారు.  ఈ సినిమాను నటి రాధికా కుమారస్వామి నిర్మించారు. కామెడీ, లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. రాధికా కుమారస్వామి సమర్పణలో రవిరాజ్‌ తెలుగులో త్వరలో రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమా తెలుగులో లక్కీ స్టార్‌గా రిలీజ్‌ కానుంది.  ఈ సినిమా ట్రైలర్‌ని తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రవిరాజ్‌ మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్‌కు ఫ్యాన్సీ ఆఫర్‌ వచ్చినా కాదనుకుని తెలుగులో మేము రిలీజ్‌ చేస్తున్నాం. తెలుగులో ఓ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించాం అన్నారు. యశ్‌ నటన ప్రధాన ఆకర్షణగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.  

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events