Skip to main content

Namaste NRI

దీపావళి కానుగా సర్దార్‌

కార్తీ హీరోగా నటిస్తున్న  చిత్రం సర్దార్‌. పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకుడు. రాశీ ఖన్నా కథా నాయికగా నటిస్తున్నారు. రజీషా విజయన్‌, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. ఎస్‌. లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై విడుదల చేయనున్నారు నాగార్జున. ఈ చిత్రం తెలుగు పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న విషయాన్ని ప్రకటించారు. టైక్నో` థ్రిల్లర్స్‌ని రూపొందించడంలో మంచి పేరున్న మిత్రన్‌ మరో ఆసక్తికరమైన కథతో తీస్తున్న చిత్రమిది. అభిమన్యుడుతో  తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఈసారి కార్తితో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ని తెలుగు, తమిళ భాషల్లో దీపావళికి రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. లైలా, మునిస్కాంత్‌, అశ్విన్‌, యోగ్‌జాపి తదితరులు నటించిన  ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, కెమెరా: జార్జ్‌ సి. విలియమ్స్‌.

Social Share Spread Message

Latest News