జపాన్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. టోక్యోలో దాదాపు 150 ఏళ్ల రికార్డు బ్రేక్ అయినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా జూన్ నెలలో ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపారు. టోక్యోలో అత్యధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 1875 తర్వాత జూన్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్పారు. దీంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్తును మితంగా వాడుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వడదెబ్బ తగిలిన కేసులో నగరంలో ఎక్కువయ్యాయి. హాస్పిటళ్లకు ఆ కేసుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.