Namaste NRI

రంగ రంగ వైభవంగా టీజర్‌

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం రంగ రంగ వైభవంగా. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది.  బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ సంస్థ నిర్మిస్తోంది.  గిరీశాయ దర్శకుడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్ర యూనిట్‌ టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రం ఇక్కడి వరకు రావడానికి కారణం వైష్ణవ్‌ తేజ్‌. ఒక హీరోను కలిసి కథ చెప్పడమంటే చాలా కష్టం. కానీ, ఒక్క ఫోన్‌కాల్‌తో ఆయన ననున్న కలిసి కథ విన్నారు. తన ఎనర్జీ మరో స్థాయిలో ఉంటుంది. కేతిక కళ్లు చూడగానే ఆమెనే నా రాధ అని ఫిక్సయిపోయా. తను ఆ  పాత్ర అద్బుతంగా చేసింది. దేవిశ్రీ మంచి పాటలు, శ్యామ్‌ చక్కటి విజువల్స్‌ ఇచ్చారు. సినిమా చూశాక నా సామి రంగ రంగ రంగ వైభవంగా అని ప్రేక్షకులు ఫిలవుతారు అన్నారు. హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ  టీజర్‌ కాదు సినిమా కూడా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండగా నిలిచిన చిత్ర బృందానికి, ప్రేక్షకులకు థ్యాంక్స్‌ అన్నారు. కేతికా శర్మ మాట్లాడుతూ మంచి ఫీల్‌ గుడ్‌ చిత్రమిది. అందరికీ నచ్చుతుంది. ఇంత మంచి  అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. రాధ పాత్రను మీరంతా ఇష్టపడతారు అని చెప్పింది. నటుడు నవీన్‌ చంద్ర మాట్లాడుతూ  మంచి సినిమా చేశాం. ఈ చిత్రం చూశాక అబ్బాయిలందరూ కేతికతో ప్రేమలో పడతారు అన్నారు. మెగా హీరోలందరితో సినిమాలు చేశా. ఇప్పుడు వైష్ణవ్‌తో చేశాను. అన్ని సినిమాలు విజయవంతమైనట్లే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుంది అన్నారు చిత్ర నిర్మాత. ఈ కార్యక్రమంలో నవీన చంద్ర, బాపినీడు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events