జోక్విన్ ఫీనిక్స్ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం జోకర్. ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన టాడ్ ఫిలిప్స్ ఈ సీక్వెల్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని 2024 అక్టోబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని చిత్ర సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. జోకర్‌కు పూర్తి భిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సీక్వెల్‌లో హార్లే అనే కీలక పాత్రలో లేడీ గాగా సందడి చేయనుంది. జోకర్ ఫస్ట్ పార్టు సరిగా ఇదే రోజు అనగా 2019 అక్టోబర్ 4న విడుదలైంది. సరిగ్గా ఐదేళ్లకు జోకర్ సీక్వెల్‌తో అలరించేందుకు వస్తున్నాడన్నమాట. వరల్డ్ వైడ్‌గా గ్లోబల్ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన జోకర్ మరి సెకండ్ పార్టుతో ఏ రేంజ్‌లో బాక్సాపీస్ ను షేక్ చేస్తాడోనని ఎక్జయిటింగ్ ఎదురుచూస్తున్నారు మూలీ లవర్స్.