యూఏఈ వెళ్లే ప్రవాసులకు అక్కడి ప్రభుత్వం కొత్త షరతు విధించింది. రెసిడెన్సీ వీసా కోసం తప్పనిసరిగా ఆరు మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే నాన్ ఎమిరటీలకు కొత్త రెసిడెన్సీ వీసా లేదా వీసా రెన్యూవల్ కోసం ఆరు వైద్య పరీక్షలు ఉంటాయని తన ప్రకటనలో పేర్కొంది. వీటి ద్వారా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తేలిన తర్వాతే రెసిడెన్సీ వీసా తదుపరి ప్రాసెస్ చేయడం జరుగుతుందని స్పష్టం చేసింది. విదేశీయులు వర్క్/ రెసిడెన్సీ పర్మిట్లు పొందాలంటే వారికి హెచ్‌ఐవీ, టీబీతో పాటు ఇతర అంటువ్యాధులేమీ ఉండకూడదని డీజీఓవీ తెలియజేసింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలియజేసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)