భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి జగ్దీప్ ధన్ఖడ్ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అళ్వాపై 346 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. ధన్ఖడ్కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దేశ 16వ ఉప రాష్ట్రపతిగా ఆయన ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ధన్ఖడ్ గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.