నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తీకేయ 2. ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి రూపొందించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితముతున్న సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ కార్తికేయ 2ను సరదాగా హిందీలో 50 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. ఆది రెండో రోజుకు 200 థియేటర్స్ పెరిగి, ఇప్పుడు 700 థియేటర్స్‌లో ఆడుతంది. సినిమా అనేది భాష అనే బారికేడ్లను క్రాస్ అయ్యి ప్రజల గుండెల్లోకి వెళ్లింది. సినిమాలో సత్తా లేకపోతే అన్ని థియేటర్స్‌లో అడదు కదా అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ఏ సినిమా బాగా ఆడినా ముందు మేము ఆనంద పడతాం. ఇండస్ట్రీలో విభేదాలు లేకుండా మేమంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాం అన్నారు. మా సినమా తెలుగుతో పాటు హిందీలోనూ బాగా ఆడుతుండటం హ్యాపీ అన్నారు నిఖిల్. మా సినిమా పెద్ద హిట్ చేసిన ప్రేక్షలకు థ్యాంక్స్ అన్నారు టీజీ విశ్వప్రసాద్.చందు మొండేటి. ఈ కార్యక్రమంలో అనుపమ, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ నారంగ్, శ్రీవాస్, బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)