శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఒకే ఒక జీవితం. రీతూ శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో ఒకటే కదా అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. కథానాయకుడి జీవితంలోని సంఘర్షణ, ప్రేమకోసం అతను పడే తపనను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు జేక్స్ బిజోయ్ స్వరాల్ని సమకూర్చారు. గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది అని చిత్ర బృందం పేర్కొంది. అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు నటిస్తున్నారు. శ్రీకార్తీక్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ సారంగ్, సంభాషణలు: తరుణ్‌భాస్కర్, రచన `దర్శకత్వం: శ్రీ కార్తిక్.