దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ జంటగా నటించిన చిత్రం ప్రతిబింబాలు. ఈ చిత్రం దాదాపు 40 ఏండ్ల తరువాత ఇప్పుడు విడుదల కాబోతుంది. ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్వకత్వంలో శ్రీ విష్ణుప్రియ కంబైన్స్ పతాకంపై నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 1982లో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధలతో నిర్మించిన ప్రతిబింబాలు చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల విడుదల చేయలేకపోయాను. అయితే ప్రస్తుత సాంకేతికతను మిళితం చేసి, సరికొత్త హంగులతో సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి పురస్కరించుకుని అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం కూడా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్వహణ: జాగర్లమూడి సురేశ్‌బాబు, సమర్పణ: రాజేశ్వరన్ రాచర్ల.