Namaste NRI

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో తెలుగు వనితల కోసం “నారి -2022″… హాజరైన మంత్రి రోజా

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ లో నివసించే తెలుగు వనిత ల కోసం “నారి -2022” అనే శీర్షిక తో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. స్థానిక ఆర్చర్డ్ హోటల్ లో హారితేజ వ్యాఖ్యాత గా ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది వనిత లు హాజరయ్యారు. ప్రముఖ నటి, ఆంధ్రప్రదేశ్ పర్యాటకం, సంస్కృతి మరియు యువత అభివృద్ధి శాఖా మంత్రి ఆర్ కె రోజా గారు ముఖ్య అతిధి గా హాజరవ్వగా , ప్రముఖగాయని సునీత తన గాత్రం తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

ఈ కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ యస్ టి యస్ పోటీలు, ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఆటలు, వేషభాషల అనుకరణ పోటీలు , ఇన్స్టరీలు పోటీలు, స్టెప్స్ ఛాలెంజ్, అమ్మ కూతుర్ల సరదా సందడి పోటీ, వివిధ వినోదభరితమైన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్దులనుచేశాయి. సంప్రదాయ భద్రంగా వివిధ రకాల చీరలతొ నిర్వహించిన ప్రదర్శన సింగపూర్ బుక్ ఆఫ్ రికార్ద్స్ లో స్థానం సంపాదించడం విశేషం. రోజా గారు మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకం గా కార్యక్రమాన్ని రూపొందించడం , ఇంత మంది మహిళలు హాజరుకావడం, దానికి తనను ముఖ్య అతిధి ఆహ్వానించడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం ఈ కార్యక్రమం చేయటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఆహుతులను అలరింపచేసిన హారితేజకు, సునీత కు కృతజ్ఞతలు తెలియజేసారు. తన బిజీషెడ్యూల్ ని పక్కనబెట్టి ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిధి గా విచ్చేసిన రోజా గారికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుటకు కృషిచేసిన కార్యవర్గ సభ్యులకు, కార్యవర్గ సభ్యుల జీవిత భాగస్వాములకు, వాలంటీర్స్ కు, స్పాన్సర్స్ కు, విజేతలకు, సింగపూర్ లోని పలు మహిళా సంఘాలకు, లక్కీ డ్రా విజేతలకు మరియు విచ్చేసిన మహిళలు అందరికీ కార్యక్రమ నిర్వాహకురాలు విజయ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events