Namaste NRI

హాంకాంగ్‌లో  భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హాంకాంగ్‌లో ఘనంగా నిర్వహించారు.  కాన్సుల్‌ జనరల్‌ సత్వంత్‌ ఖనాలియా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రసంగంలోని సారాంశాన్ని చదివి వినిపించారు.  సుర్‌ సాధన గ్రూప్‌ దేశభక్తి గీతాలు, సలాంగై డ్యాన్స్‌ అకాడమీ వారిచే నిర్వహించిన భరతనాట్యం, శ్రీశక్తి అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్‌ కథక్‌లతో ప్రతిధ్వనించింది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన  క్విజ్‌ పోటీల విజేతలకు సత్వంత్‌  ఖనాలియా పతకాలను అందజేశారు. హాంకాంగ్‌ ముకావు ఎస్‌ఏఆర్‌ నివాసితులు కాన్సులేట్‌, టీకప్‌ ప్రొడక్షన్స్‌ సహకారంతో అభివ్యక్తి పేరిట హిందీలో రాసిన 25 కథల సంకలాన్ని ప్రచురిచింది. ఆ పుస్తక సంపాదక సభ్యులు కొందరు రచయితలకు ఈ సందర్భంగా కాన్సుల్‌ జనరల్‌ సత్కరించారు.  ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

                అనంతరం ప్రధాని మోదీ పిలుపు మేరకు హర్‌ ఘర్‌ తిరంగ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హాంకాంగ్‌ చైనా ఉపాధ్యక్షుడు, రాజు సబ్నానీ, రమాకాంత్‌ అగర్వాల్‌, అజయ్‌ జకోటియా, రాజు షా, కుల్దీప్‌ ఎస్‌. బుట్టార్‌, సోనాలి వోరా ప్రచారానికి మద్దతుగా నిలిచారు. వారి కృషి, అంకితభావంతో హాంకాంగ్‌లో హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారం విజయవంతంగా సాధ్యమైందని నిర్వాహకులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events