75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్నారై పొట్లూరి రవి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 30 వీల్ చైర్లను అదజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రవాస భారతీయుడు పొట్లూరి రవి కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. ఆసుప్రతిలోని 500 పైగా రోగులకు బ్రెడ్ పాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం బాలకృష్ణ ఆధ్వర్యంలో 30 వీల్ ఛైర్లను అందించారు. చేతన ఫౌండేషన్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో పౌండేషన్ చైర్మర్ రవి వెనిగళ్ల, కో ఆర్డినేటర్ రంగరావు, పొట్లూరి కృష్ణారావు, ముప్పా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.