Namaste NRI

బాపట్ల ఎంపీ బయోపిక్‌ షురూ

అగస్త్య, నక్షత్ర జంటగా సురేఖ ప్రొడక్షన్స్‌ పతాకంపై నందిగం వెంకట్‌ నిర్మాతగా దర్శకుడు నానాజీ మిరియాల రూపొందిస్తున్న సినిమా బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి ఎంపీ నందిగం సురేష్‌ క్లాప్‌నివ్వగా, నిర్మాత కుమారు దేవన్‌, ప్రిన్స్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.  ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నందిగం వెంకట్‌ మాట్లాడుతూ సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి ప్రజాదరణ పొంది బలమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది ఈ చిత్ర కథాంశం. ప్రజా జీవితంలో అతను ఎదిగే క్రమంలో ఎదురైన ఆంటకాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు అనేది సినిమాలో చూపిస్తున్నాం అన్నారు. దర్శకుడు నానాజీ మిరియాల మాట్లాడుతూ ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే జీవితంలో ఎదుగుతాం అని చెప్పే చిత్రమిది. ప్రతి సామాన్యుడు చూసి స్ఫూర్తి పొందే విధంగా సినిమా ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె నాయుడు, ఎడిటర్‌: మూర్తాండ్‌ కె వెంకటేష్‌, సంగీతం : అనూప్‌ రూబెన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events