అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికకు మరో రెండు వారాల గడువే ఉండటం, ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే వెనుకబడి ఉన్న నేపథ్యంలో రిషి సునాక్ వర్గం కొత్త తరహా ప్రచారాన్ని ప్రకటించారు. మాంచెస్టర్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో రిషి మాట్లాడుతూ చివరి రోజు వరకు ప్రతి ఓటు కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా అన్నారు. మాంచెస్టర్ ప్రచార వీడియోను విడుదల చేశారు. అందులో అండర్ డాగ్‌తో జాగ్రత. ఎందుకంటే ఓటమి అంచున్న ఉన్న వాళ్లు పొగొట్టుకునేదేమీ ఉండదు. ఉన్న ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటారు అని వినిపిస్తుంటుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)