రాజకీయంగా సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనే బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢల్లీి మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలతో ప్రజల్లో బీజేపీ మరింత చులకనవుతుందని తెలిపారు. బీజేపీ ఎన్ని కుట్రు చేసిన తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటనే ఉన్నారని స్పష్టం చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు కేసీఆర్ బెదిరే నాయకుడు కాదని, ఎంతో మందితో పోరాడి తెలంగాణ సాధించిన ఫైటర్ అని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు చిల్లర వేషాలు ఇప్పటికైనా ఆపకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)