తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని తెలిసి, టీఆర్‌ఎస్ నాయకులపై నిందలు వేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢల్లీి లిక్కర్ స్కాంకు సంబంధించి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై వస్తున్న ఆరోపణలను ఖండిరచారు. ఆ ఆరోపణలు నిరాధారమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితపై బురదజల్లడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సరైన సమయంలో ప్రజలే బీజేపీకి బుద్ధి చెప్పారని స్పష్టం చేశారు.