నిర్మాత డి.సురేష్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం అహింస. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సదా, రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించారు. పి.కిరణ్ నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం అహింస. అన్ని కమర్షియల్ హంగులు ఉన్న తేజ మార్క్ సినిమా ఇది. నువ్వు నేను తర్వాత తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్పీ పట్నాయక్ కలిసి అహింస తో మరో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ఇవ్వనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: ఆర్పీ పట్నాయక్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: అనిల్ అచ్చుగట్ల, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)