నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కృష్ణ వ్రింద విహారి. అనీష్ ఆర్ కృష్ణ దర్శకుడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని తార నా తార అనే పాటను విడుదల చేశారు. మెలోడీ బాణీతో నాయకానాయికలు నాగశౌర్య, షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీని ఆవిష్కరిస్తూ సాగిందీ పాట. శ్రీమణి రాసిన ఈ గీతానికి మహతి స్వరసాగర్ సంగీతాన్నందించారు. నకాస్ అజీజ్ ఆలపించారు. కొత్తదనం నిండిన ప్రేమకథతో రూపొందిన చిత్రమిది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది. నాగశౌర్య, షిర్లీల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది అని చిత్ర బృందం తెలిపింది. రాధికా శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి, దర్శకత్వం: అనీష్ ఆర్ కృష్ణ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)