అమెరికాలో కాలిఫోర్నియాలోని ట్రేసీహిల్స్లో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఐదు రోజుల పాటు వినాయకుడి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా పలవురు భక్తులు భజన కీర్తనలు ఆలపించారు. చిన్నారుల నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ట్రేసీ పోలీస్ బృంద సభ్యులు కూడా ఉత్సవాల్లో పాల్గొని నృత్యాలు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు తెలియజేయడానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వాలంటీర్ల బృందం తెలిపింది. దాదాపు వెయ్యి మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.