మరో భారతీయుడు అమెరికా కంపెనీలో కీలక పోస్టుకు ఎంపికయ్యారు. చెల్లింపు సేవల బహుళజాతి కంపెనీ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎఇబిసి) సంజయ్ ఖన్నాను తన భారతీయ విభాగం ఎఇబిసి ఇండియా సీఇఒ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), రీజినల్ మేనేజర్‌గా నియమించింది. ఖన్నా దేశ కార్యనిర్వాహక బృందానికి నాయకత్వం వహిస్తారని, ఆ సంస్థ తెలిపింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఇంటర్నేషనల్ కార్డ్ సర్వీసెస్) రాబ్ మెక్‌క్లీన్ మాట్లాడుతూ 30 ఏళ్లకు పైగా పరిశ్రమ అనుభవంతో సంజయ్ అత్యుత్తమ ఫలితాలను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)