శ్రీసింహా కోడూరి, ప్రతీ అస్రాణి జంటగా నటిస్తున్న చిత్రం దొంగలున్నారు జాగ్రత్త. సతీష్ త్రిపుర దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్‌పై డి.సురేష్‌బాబు, సునీత తాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. శ్రీసింహా మాట్లాడుతూ వినూత్నమైన కాన్సెప్ట్ ఇది. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ అనుభవం సినిమాకు బాగా తోడ్పడిరది. సినిమా ఆసాంతం ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు. నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ ప్రేక్షకులకు కొత్త కథ చెప్పాలనే లక్ష్యంతో సురేష్‌బాబు, నేను ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులకు ఇదివరకెప్పుడూ చూడని కొత్త అనుభవాన్నిస్తుంది. కాలభైరవ మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని అన్నారు. దర్శకుడు సతీష్ త్రిపుర మాట్లాడుతూ తెలుగులో వస్తున్న తొలి సర్వైవల్ థ్రిల్లర్ ఇది. కాలభైరవ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశం థ్రిల్‌ను పంచుతూ సాగుతుంది అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: యువరాజ్ కార్తికేయన్, చిత్రా సుబ్రమణ్యం, వంశీ బండారు, లైన్ ప్రొడ్యూసర్: డి. రామ బాలాజీ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)