తైవాన్‌కు అమెరికా నుంచి మిలటరీ సాయం అందించే బిల్లుపై చైనా దేశం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చైనా నుంచి ఎంత తీవ్రమైన ప్రతిఘటన వస్తున్నప్పటికీ ఈ బిల్లు అమెరికాలో ముందుకే సాగుతోంది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. ఈ బిల్లు అమెరికా` చైనా సంబంధాల పునాదులు కదిలించి వేస్తుంది. తైవాన్ స్ట్రెయిట్‌లో శాంతి, సుస్థిరత్వంపై తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు. తైవాన్‌తో సంబంధాలను అధికారికం చేయడమే కాకుండా నాలుగేళ్ల కాలంలో అమెరికా నుంచి తైవాన్‌కు 4.5 బిలియన్ డాలర్ల మిలటరీ సాయం అందించాలని ఒక సెనేట్ కమిటీ సూచించింది. ఒకవేళ తైవాన్‌ను మిలటరీ చర్యల ద్వారా ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తే కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరికలు చేసింది. తైవాన్‌కు అమెరికా ఆయుధాలను అమ్మడంపై చైనా అభ్యంతరం చెప్పింది. ఇప్పుడే ఏకంగా భారీ మొత్తం మిలటరీ సాయం అందించాని నిర్ణయంపై చైనా కన్నెర చేసింది.