కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. కమల్ హాసన్ అంటే ప్రయోగాలకు కేరాప్ అడ్రస్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ 2లో కూడా ఎవరూ చేయని కొత్త ప్రయోగాన్ని చేయబోతున్నాడట లోకనాయకుడు. కమల్ హాసన్ ఈ చిత్రంలో ఏకంగా 14 భాషల్లో మాట్లాడబోతున్నాడట. తాజాగా అప్డేట్ ఏంటంటే ఇండియన్ 2లో 14 భాషల్లో వచ్చే 10 నిమిషాల డైలాగ్ ఉండనుందట. అంతేకాదు ఈ డైలాగ్ కూడా సింగిల్ షాట్లో ఉండబోతుందన్న వార్త ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఈ సన్నివేశం చిత్రీకరణ పూర్తయినట్టు తెలుస్తోంది. సీన్లో కమల్ హాసన్ స్టిన్నింగ్ పర్ ఫార్మెన్స్ తో అదరగొట్టి సెట్స్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ షాక్ అయ్యేలా చేశాడని కోలీవుడ్ సర్కిల్ టాక్.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా, బాబీ సింహా, సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్ `రెడ్ జియాంట్ మూవీస్ పై ఉధయనిధి స్టాలిన్ ` సుభాస్కరన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ 2 చిత్రానికి అనిరుధ్ రవిచందన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే రిలీజైన కమల్ హాసన్ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.