వచ్చే పాతికేళ్ల భారత అభివృద్ధి పయనంలో అమెరికా కీలక పాత్ర పోషించగలదని ప్రధాని మోదీ అన్నారు. వాషింగ్టన్‌లోని యూఎస్ క్యాపిటల్‌లో ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పుస్కరించుకుని భారతీయ సంతతి అమెరికన్లకు ప్రధాని మోదీ సందేశం పంపారు. అమెరికా పార్లమెంట్‌లో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఇరు దేశాల మైత్రీబంధంలో మైలురాయిగా నిలిచిపోవాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ అనే పదం వినగానే ఎన్నో అంశాలు స్పూర్తిసాయి. అధునాతన ప్రజాస్వామ్య దేశం, భిన్నజాతులు, ప్రాచీన నాగరికతల ఇండియాను ప్రపంచం గుర్తు చేసుకుంటుంది. ఇదే రీతిలో భిన్న అంశాల్లో గ్లోబల్ ఇండియన్‌తో భారత్ మమేకమైందన్నారు. వచ్చే పాతికేళ్ల అమృతకాలంలో భారత సుస్థిరాభివృద్ధికి అమెరికా ఎంతగానో సాయపడనుందని భావిస్తున్నాం. అమెరికాలో మీరంతా భారత్ తరపున అత్యద్భుతమైన ప్రతినిధులుగా ఉంటారని ఆశిస్తున్నాం అని మోదీ అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)