ప్రవాసులకు రెసిడెన్సీ వీసాలకు సంబంధించి ఒమన్ పోలీసులు కీలక సూచన చేశారు. రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపీ) తెలిపింది. ప్రవాసులు పాస్‌పోర్ట్‌లపై వీసా స్టాంపింగ్ తప్పనిసరి కాదు. వీసా ప్రయోజనాలు పొందేందుకు నివాస కార్డు ఉంటే సరిపోతుందని ఆర్ఓపీ వెల్లడిరచింది. ఇంతకుముందు ప్రవాసుల పాస్‌పోర్టులపై వీసా స్టాంపింగ్ తప్పనిసరి అనే నిబంధన ఉండేది. తాజాగా ఆ నిబంధనను తొలగించారని రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.