ఫిన్‌లాండ్‌లో రష్యన్ పర్యాటకులు దేశంలో పర్యటించకుండా నిషేధం విధించింది. పర్యాటక వీసాపై వచ్చే రష్యన్ పౌరులపై నిషేధం ఉంటుందని, రష్యా పర్యాటకులను పూర్తిగా నిషేదించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రి పెక్కా హవిస్టో తెలిపారు. నేటి నుంచి నిషేధం అమలులో ఉంటుందని ఫిన్‌లాండ్ ప్రభుత్వం పేర్కొంది. రష్యాతో సరిహద్దులో ప్రయాణీకుల కదలికను పరిమితం చేస్తామని ప్రభుత్వం తెలిపింది.