ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. బిస్సేన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్ట్రాత్‌పైన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఏర్పాటు చేసిన మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఆడిపాడి సందడి చేశారు. చిన్నారులంతా సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. బతుకమ్మ వేడుకల్లో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)