గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం స్వాతిముత్యం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతునానరు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు నవీన్ పొలిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), బెల్లంకొండ శ్రీనివాస్, సిద్దూ జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.