రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం లెహరాయి. రామకృష్ణ పరమాహంస దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత. ఇది వరకే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్‌కు, సాంగ్స్‌కు విశేష స్పందన లభించింది. ఇక సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ చిత్రంతో జీకే ఈజ్ బ్యాక్ న్నట్టు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గుప్పెడంత సాంగ్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఈ సక్సెస్‌ని పురస్కరించుకుని లెహరాయి చిత్రం నుండి బేబీ ఓసేయ్ బేబీ అనే మరోసాంగ్‌ను కూడా విడుదల చేశారు. దీన్ని కాసర్ల శ్యామ్ రచించగా, సాకేత్, కీర్తనశర్మ ఆలపించారు. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉన్నట్లు దర్శకుడు రామకృష్ణ పరమాహంస తెలిపారు. రంజిత్, సౌమ్య మీనన్, గగన్ విహారి, రావురమేష్, సీనియర్ నరేష్, అలీ, సత్యం రాజేష్, జబర్దస్త్ రాంప్రసాద్‌లు ఇతర పాత్రల్లో నటించారు. లెహరాయి రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.