స్వీడిష్ జన్యుశాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ ప్రైజ్ కమిటీ ఆయనకు నోబెల్ బహుమతిని ప్రకటించింది. అంతరించిన మానవజాతుల విశ్వజన్యురాశిపైన, మానవ పరిణామంపైన చేసిన విశేష పరిశోధనలకు గుర్తింపుగా ఆయనను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. స్వాంటే పాబో పరిశోధనలు పూర్తిగా నూతన శాస్త్రీయ క్రమశిక్షణ వేగాన్ని పెంచాయి. అంతరించిన మానవజాతులకు, ప్రస్తుతం ఉన్న ప్రపంచ మానవాళికి మధ్యగల జన్యుపరమైన బేధాలను ఆయన తన పరిశోధనలతో కనిపెట్టారు. వైద్యరంగ నోబెల్ బహుమతిని అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా పరిగణిస్తారు. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నోబెల్ అసెంబ్లీ ఈ అవార్డు విజేతను ఎంపిక చేస్తుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 10న ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు విలువ 10 మిలియన్ స్వీడిష్ క్రోన్‌లు. అంటే 9,00,357 అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారుగా 7.20 కోట్లు.స్వాంటె పాబో స్టాక్‌హోమ్‌లో జన్మించారు. ఆయన తల్లి ఎస్టోనియాకు చెందిన కెమిస్ట్ కరిన్ పాబో. తండ్రి స్వీడన్‌కు చెందిన బయోకెమిస్ట్ కార్ల్ సనే బెర్గ్‌స్ట్రోమ్. ఈయన కూడా 1982లో వైద్య రంగంలోనే నోబెల్ అందుకోవడం విశేషం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)